Tuesday, May 28, 2024

AP: జ‌గ‌న్ పాల‌న‌లో దౌర్జన్యాలు, అక్రమాలు.. అన్న‌పై ష‌ర్మిల ఆగ్ర‌హం

అక్ర‌మాలు ఎదుర్కొనేందుకే ఎంపీగా పోటీ
హ‌త్యా రాజ‌కీయాల‌కే జ‌గ‌న్ మ‌ద్ద‌తు
నిందితుల‌కే వైసిపి టికెట్లు
ధ‌ర్మం వైపు నిల‌బ‌డాల‌ని ఓట‌ర్ల‌కు పిలుపు

క‌మ‌లాపురం – వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. అక్రమాలను ఎదుర్కోవడానికే మీ రాజన్న బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందని చెప్పారు. ధర్మం వైపు నిలబడాలని ఓటర్లను కోరారు. తనను ఆశీర్వదించాలని, గెలిపించాలని ట్వీట్ చేశారు.

కడప ఎంపీ స్థానం నుంచి తమ్ముడు అవినాశ్ రెడ్డిపై పోటీ చేసి అన్న, ఏపీ సీఎం జగన్‌కు సవాలు విసురుతున్న షర్మిల ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించానని ఆమె అన్నారు. దారిపొడవునా స్వాగతం పలికి మద్దతు తెలిపిన అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మన కడప నగరానికి ఎంతో సేవ చేశార‌న్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కల అని,. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే 25వేల మందికి ఉద్యోగాలు వచ్చేవ‌న్నారు. ఆయన వారసుడు అని చెప్పుకునే జగన్ అభివృద్ధి మరిచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ నిందితులకే టికెట్లు ఇస్తున్నారంటూ షర్మిల ధ్వజమెత్తారు. కమలాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement