Thursday, June 13, 2024

AP : స‌బ్సిడీ కోసం వెళ్తే లంఛం అడిగాడు…ఏసీబీ వలలో చిక్కాడు

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్‌ మేనేజర్ మురళీ గ‌త‌ రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ ఆయన రూ.2 లక్షలు మురళి డిమాండ్ చేసారు. బాధితుడు చేసేది ఏమిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను అధికారులు రెడ్‌ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement