Monday, April 29, 2024

AP – విధ్వంసం చేసిన పాల‌కుల‌ను త‌రిమికొడ‌దాం…. ప్రజలకు చంద్ర బాబు పిలుపు

తాడేపల్లిగూడెం – చ‌రిత్ర తిర‌గ‌రాద్దాం విధ్వంపమైన రాష్ర్టాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సైకో సీఎం జగన్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ కలిసికట్టుగా పోరాడుదాం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం జెండాగా పేరు పెట్టిన ఈ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. 21 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేయగా.. స్థలం చాలలేదు. కిటకిటలాడింది

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ సభ తాడేపల్లిగూడెం చరిత్రను తిరిగి రాస్తుందని, తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు తమ పార్టీలు అధికారంలోకి రావటానికి కాదు, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జత కలిశామన్నారు.

విధ్వంసం చేసిన పాల‌కుల‌ను త‌రిమికొడ‌దాం..

రాష్ట్రంలో వైఎస్ఆర్ దొంగలపై పోరాడుతున్నామని, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకులను తరిమి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. తాడేపల్లిగూడెం సభలో జనం స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందని . ఈ సభ రాష్ర్టానికి శుభసూచకం, నవోదయం అని, చంద్రబాబు వివరించారు. ఒక వ్యక్తి అహంకార వ్యక్తి చేసిన విధ్వంసంతో నష్టపోయాం, ఇక ఈ విధ్వంసాన్ని కొనసాగనీయం, వైనాట్ 175 అంటున్నాడని, కానీ వైనాట్ పులివెందుల అని చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -

పులివెందులలో తప్పక ఓడిస్తామన్నారు. హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కుప్పంలో కృష్ణా నీళ్లు పేరిట 23 గంటల సినిమా చూపించారని, సినీ సెట్టింగ్లతో గేట్లు పెట్టారని, ఈ నాటకాలు జనానికి తెలిసిందని, తనను లక్ష ఓట్ల మెజారిటీతో జనం గెలిపిస్తారని వివరించారు.

వైసీపీ గూండాల చ‌రిత్ర ముగిసిన‌ట్టే..ఇక వైసీపీ గూండాల చరిత్ర ముగిసినట్టే, తమ పార్టీ అభ్యర్థులు విద్యావంతులు కాగా.. వైసీపీ అభ్యర్థులు స్మగ్లర్లు అని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం, రైతులకు అండగా ఉంటాం, సంపద పెంచుతాం, సంపద ఆదాయాన్ని అందరికీ పెంచుతామం, ఎస్సీ, ఎప్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులందరిని దృష్టిలో పెట్టుకుని మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి నాయకుడిని గుర్తుపెట్టుకుంటామని, బాధపడవద్దని, ఇగోలు వద్దని, ప్రతినాయకుడి శ్రమను గుర్తిస్తామని పవన్ సమక్షంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement