Friday, July 26, 2024

AP – టిడిపి కూటమి నేత ఎంపిక నేడే – మరి కొద్దిసేపటిలో మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నగరంలోని ఏ-కన్వెన్షన్ టీడీపీ-జనసేన-బీజేపీ నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలందరూ హాజరు కానున్నారు.

భేటీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు సైతం qహాజరు కానున్నారు.. ఈ సమావేశంలోనే కూటమి తరఫున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

అనంతరం.. చంద్రబాబు విడిగా గానీ లేదంటే కూటమి పార్టీల నేతలతో కలిసి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రం సమర్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ నజీర్‌ను చంద్రబాబు కోరనున్నారు.

- Advertisement -

కూటమి మీటింగ్‌ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఈ సమావేశంలో పవన్‌ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు

మరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్‌ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది.

వీఐపీల రాక..

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చం‍ద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.. ఇందుకోసం నేటి నుంచే ప్రముఖులు నగరానికి రానున్నారు.

ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణం రూపొందించారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండగా, 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది. వీవీఐపీ లు,వీఐపీ లతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారుల్ని ఆ గ్యాలరీలకు ఇంఛార్జిలుగా నియమించారు.

దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతప్రధాని మోదీ సహా ఇతర వీవీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సుమారు 7 వేల మందిని నియమించింది రాష్ట్ర పోలీస్‌ శాఖ. అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement