Tuesday, July 23, 2024

Under-17 | వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఏపీ విద్యార్ధుల ప్రతిభ..

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అండర్‌ – 17 బాలికల విభాగంలో ఏపీ బృందానికి రెండు బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలు లభించాయి. మొత్తం ఆరు పతకాలతో బాలిక విభాగంలో ఏపీ ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ నందు ద్వితీయ స్థానం సాదించింది.

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 67వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అండర్‌ – 17 ఈ నెల 13 నుంచి బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో జరుగుతున్నాయి. ఈ పోటీలు ఈ నెల 16తో ముగిశాయి. శనివారం విజేతలను ప్రకటించగా మొత్తం ఆరు పతకాలతో బాలిక విభాగములో ఏపీ ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌గా ద్వితీయ స్థానం లో నిలిచింది.

బాలికల టీం కోచ్‌ గా కొల్లిపర నాగ శిరీష వ్యవహరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement