Sunday, April 21, 2024

AP – కాంగ్రెస్ చలో సెక్రటేరియట్‌ తో గృహనిర్బంధాలు – పార్టీ కార్యాలయంలోనే షర్మిల నిద్ర

విజయవాడ: దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు..

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాల్సి ఉండగా.. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసారు ఉదయం ‘చలో సెక్రటేరియట్‌’కు బయలుదేరి వెళ్లనున్నారు.

ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ టెన్షన్..

షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మో.హరించారు కార్యాలయం చుట్టూ బారికెడ్స్ ఏర్పాటు చేశారు.

గృహనిర్బంధాలపై షర్మిల ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు. ”నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్‌ అరెస్టులు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్‌ అరెస్టు కాకుండా ఉండేందుకు.. పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా?.. లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే.. భయపడుతున్నట్లే కదా! ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement