Monday, April 15, 2024

AP – నాలుగో సభకు జ‌గ‌న్ సిద్ధం .. చిల‌క‌లూరి పేటలో వేదిక ఖరారు

గుంటూరు: వైఎస్సార్‌సీపీ నుంచి మరో సిద్ధం సభ ముహూర్తం ఖరారు కానుంది. మార్చి మొదటి వారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటనలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. నాలుగో సిద్దం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించనున్నారు. మార్చి మొదటి వారంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరగనుంది. జాతీయ రహదారికి దగ్గరగా ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. నాలుగు జిల్లాల శ్రేణులతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరు కానున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement