Sunday, April 28, 2024

AP – చేపల వేట.. రాజకీయాల ఆట

ప్రభ న్యూస్‌ పోలవరం -గోదావరి చేపల వేట రాజకీయ వలలో చిక్కుకుంది. గోదావరిలోని అంతులేని మత్స్యసంపదను దక్కించుకునేందుకు రాజకీయ నేతలు మత్య్సకారులను నిషేధిత పాపికొండలు అభయారణ్య ప్రాంతంలోని గోదావరిలోకి పంపి చేపల వేట చేయిస్తున్నారు. పోలవరం మండలంలోని మత్స్యకారులు అభయారణ్యంలోకి పోకుండా చేపల వేట సాగిస్తున్నారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ,కొవ్వూరు ప్రాంతాల నుండి కొంతమంది మత్స్యకారులు 100 బోట్లతో ప్రాజెక్టు ఎగువ నేషనల్‌ పార్క్‌ ప్రాంతాలకు వెళ్లి చేపల వేట ప్రారంభిస్తున్నారు. వారు ఐలా (సీడ్‌ ) వలలు ఉపయోగించి ప్రాజక్టుకు ఎగువన అభయారణ్య ప్రాంతంలో వేట సాగిస్తుండడంతో గోదావరిలో మత్స్యసంపద మనుగడ ప్రశ్నార్ధకమయింది.

ఈ వేట మత్స్యశాఖ నిబంధనలకు, నేషనల్‌ పార్క్‌ అటవీ చట్టం 2008 కి విరుద్ధంగా పాపికొండల జాతీయ పార్కు పరిధిలోకి వెళ్లి అక్కడే మకాం వేసి చీరమేన్‌ అవిలి (అప్పుడే పుట్టిన చేపలను సైతం పట్టి చిన్న కన్నాలు గల వ) లతో చిన్నచిన్న చేపలను సైతం పట్టి అక్కడే ఎండబెట్టి భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.కాగా,తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులను అక్కడి వైసీపీ నాయకులు కొందరు వెనక ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. వారి ప్రమేయం వల్లే గోదావరి మత్స్య సంపద కొల్లగొడుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారని అంటు-న్నారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం చేపల వేటపై నిషేధం ఏం లేదని చెబుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం అభయారణ్యం పరిధిలో వేట నిషేధమని అన్నారు. కాగా ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని కొరుటూరు, తూటు-కుంట, మాదాపురం, కోండ్రుకోట, వాడపల్లి, సింగనపల్లి,శివగిరి నిర్వాసిత మత్స్యకారులు గోదావరిలో చేపలు వేట మీద ఆధారపడి కుటు-ంబ పోషణ సాగిస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, సీతానగరం, మడిపల్లి, మూలపాడు, కొండమొదలు గ్రామాల మత్స్యకారులు గోదావరి నదిలో చేపలు వేట మీద ఆధారపడి కుటు-ంబాలు పోషించు కుంటు-న్నారు.ఇపుడు కొవ్వూరు, రాజమండ్రి, తుని ప్రాంతాల నుండి వచ్చిన మత్స్యకారులు తుపాకులతో వంద పడవలతో గోదావరి ఎగువన అభయారణ్య పరిధిలోకి జొరబడ్డారు. అక్కడ రోజుకు సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే చేపలను వారు టన్నులకొద్దీ పడుతున్నారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నిస్తే తుపాకులు చూపి భయపెడుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపించారు. పాపికొండల అభయారణ్యం పరిధి గోదావరిలో ఇతర ప్రాంత మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారుల ఉపాధి పోగొడుతున్నారంటూ మంగళవారం పోలవరం అటవీశాఖ క్షేత్రాధికారి ఎన్‌ దావీదు రాజుకి మత్స్యకారులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానంతరం ప్రాజెక్టు దిగువున నదిలో చేపల సంతతి తగ్గడం వలన తాము ఉపాధి కోల్పోయామని, ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన తూటిగుంట, కోండ్రుకోట ,కొత్తూరు ,చీడూరు, టేకూరు నిర్వాసిత గ్రామాల్లో ఉన్న మత్స్యకారులంతా ఉపాధి కోల్పోవడం వలన అధికారులు తమకు ప్రాజెక్టు ఎగువన చేపల వేటకు అనుమతులు ఇచ్చారన్నారు. ఇతర ప్రాంతాల మత్స్యకారుల చొరబాటు-ను అరికట్టి తమ ఉపాధిని కాపాడాలని కోరారు. మత్స్యకారులు పొన్నాడ.వెంకటేశ్వరరావు, పొన్నాడ. వీరస్వామి, పాలీపి. పోసియ్య, గోపాల. వెంకటేశులు, పంతుల రాజు, పంతుల. కళ్యాణరావు, ముంగర. వెంకటరావులు మాట్లాడుతూ నదిలో ఐలా(సీడ్‌) వలలతో చేపలు పడితే ఒక్క చేప పిల్ల కూడా మిగిలి ఉండదని తెలియజేశారు.

సీడ్‌ వలతో వేటాడితే చేప గుడ్డుతో సహా వలలోకి వచ్చేస్తాయి. వీరి వద్ద తుపాకులు కూడా ఉన్నాయని చెప్పారు. తుపాకులు గురిపెట్టే బెదిరింపులకు పాల్పడుతున్నారని భయాందోళనలు వ్యక్తం చేశారు.వారు ఇలా వేటాడితే, త‌మ‌కు చేపలు ఉండవని, కుటు-ంబ పోషణ కష్టతరం అయిపోతుందన్నారు. తాము వేట మీద ఆధారపడి జీవిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ విషయంపై అటవీక్షేత్ర అధికారి ఎన్‌ దావీదు రాజు మాట్లాడుతూ నేషనల్‌ పార్క్‌ పరిధిలో మకాం ఉంటు-న్న మత్స్యకారులను దిగువ ప్రాంతాలకు తీసుకువచ్చామన్నారు. మరల వెళ్లారని తూర్పుగోదావరి అటవిక్షేత్ర సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి.సుంకర.వెంకటరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ బుగ్గా మురళీకృష్ణ, ఐటిడిఎస్‌ డైరెక్టర్‌ గంగు.అనిల్‌ కుమార్‌ పాల్గొని అటవీ శాఖ అధికారులకు సమస్యలు వివరించి మత్స్యకారులతో వినతిపత్రం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.అభయారణ్యంలోకి ఎవ్వరిని అనుమతించమని పోలవరం రేంజ్‌ అధికారి దావీద్‌ రాజు వివరణ ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి చేపలు వేటాడం వల్ల స్తానిక మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుందని,వారి వేటకు ఉపయోగించే ఐలా వల వలన చిన్న చేపలు కూడా పట్టు- పడతాయని, పగలు కూడా వేటడాతారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్‌ అధికారులతో కలసి ఉమ్మడిగా వెళ్లి ఖాళీ చేయిస్తామని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement