Friday, May 3, 2024

AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్‌ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్‌ 42 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.

మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్‌ నిర్వహించనున్నారు. కాగా 2018 సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. cse.apgov.in వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement