Monday, May 6, 2024

AP Congress – గడప గడపకి తిరుగుతా – జగన్ అన్న పాలనను ఎండగడతా – షర్మిల

గుంటూరు – రాష్ట్రంలో ప్రతి గడపకు వస్తానని, జగన్ అన్న దుష్ట పాలన గురించి ప్రజలందరికీ వివరిస్తానని ఎపి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో నేడు కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీలో మైనారిటీలకు కష్టకాలం నడుస్తోందని, రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడి జరుగుతున్నా ఏపీ సీఎం జగన్ స్పందించలేదని షర్మిల విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ, బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తోందని మండిపడ్డారు.

సొంత పార్టీ  ఎమ్మెల్యేలకే సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని అన్నారు. సీఎం జగన్ పెద్ద పెద్ద గోడలు కట్టుకుని కోట లోపల ఉన్నారని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.  

ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? అని షర్మిల నిలదీశారు. ఎన్నికల వేళ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. గుంటూరు నగరం గుంతలూరుగా మారిపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవు… అభివృద్ధికి ఎక్కడ్నించి వస్తాయి? అని ఎత్తిపొడిచారు. 

స్వలాభం కోసం ఏపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి..బీజేపీకి బీ టీంలా మారారని విమర్శించారు షర్మిల. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పోలవరం పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ ఇప్పటికే తొలి సంతకం హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు భూమికి ,ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు షర్మిల. వైఎస్సార్ హయాంలో రైతు రారాజు.. ఇపుడు జగన్ హయాంలో వ్యవసాయం దండుగ అన్నట్లు తయారయ్యిందన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement