Sunday, April 28, 2024

AP – జగన్​ని ఇంటికి పంపాల్సిందే ..నెల్లూరులో వైసీపీ ఖాళీ – చంద్రబాబు

(ఆంధ్రప్రభ స్మార్ట్, నెల్లూరు ప్రతినిధి) – ఆంధ్రప్రదేశ్​ను పూర్తిగా నాశనం చేసిన జగన్​ను ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన కార్యక్రమంలో రాజ్యస‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి సహా తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరికతో నెల్లూరు జిల్లాలో సునాయాసంగా గెలవబోతున్నామన్నారు.యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు సేవే ఏకైక ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారని గుర్తు చేశారు. నెల్లూరు కార్పోరేషన్ మొత్తం ఖాళీ అయిపోతోందన్నారు.

వైసీపీ నుంచి వారికి స్వాగతం పలుకుతాం..

వైఎస్ఆర్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నామని చంద్రబాబు అన్నారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కొనియాడారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు పార్టీలోకి స్వాగతిస్తున్నాన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అన్నారు. ప్రజా సేవకు అంకితమైన ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారని విమర్శించారు. జగన్ విధానాలు నచ్చకే స్వంత ఎంపీలు, ఎమ్మెల్య‌లు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పారు .విశాఖపట్టణాన్ని దోచేసిన వ్యక్తిని వైఎస్ఆర్‌సీపీ నెల్లూరుకు పంపుతుందని విజ‌య‌సాయి రెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement