Sunday, May 5, 2024

కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం

ఇవాళ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరగనుంది. అంతకముందు ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది కేబినెట్. 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగించనున్నారు. వర్చువల్ విధానంలో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు గవర్నర్. ఉదయం 11 గంటలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆ వెంటనే బడ్జెట్ పై చర్చకు స్పీకర్ అనుమతించనున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన…రాజేంద్రనాథ్. ఇక మండలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక మంత్రి కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ పెట్టనుండగా, మండలిలో వ్యవసాయ బడ్జెట్ పెట్టనున్న హోంమంత్రి సుచర పెట్టనున్నారు. రూ. 2.25 – రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీటవేయనున్నారు. సామాజిక పెన్షన్ ను రూ. 2500కు పెంచనుంది ప్రభుత్వం. పెంచిన సామాజిక పెన్షన్ను జనవరి నుంచి అమలు చేయనుంది ప్రభుత్వం. ఇక 45-60 ఏళ్ల లోపు మహిళలకు ఈబీసీ నేస్తం కోసం కేటాయింపులు. ఇక ఈ ఏడాది బడ్జెట్ పై అప్పుల ప్రభావం కన్పించనున్నంది. గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక కేటాయింపులు. అప్పులు చేసైనా సంక్షేమ పథకాలు అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన. తొలిసారిగా జెండర్ బడ్జెట్ పెట్టనుంది ప్రభుత్వం. ఇక మహిళలు.. పిల్లలకు ఎంత ఖర్చు పెట్టనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్న ప్రభుత్వం.

బడ్జెట్ పై చర్చ అనంతరం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు సీఎం జగన్..ఇక కరోన పై ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. కరోన చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement