పోలింగ్ జరిగిన రోజు నుంచి మూడు రోజుల పాటు పల్నాడు, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో తలలు పగిలాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇవాళ కొద్దిగా ఆగింది. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ అయింది. ఎన్నికల అనంతరం హింసపై తమకు నివేదిక ఇవ్వాలని ఈసీ వివరణ కోరింది.
- Advertisement -
దీంతో నిన్న అత్యవసరంగా సమావేశమైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు ఆ ప్రాంత ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఇవాళ ఇద్దరూ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలవనున్నారు. ఎన్నికల అనంతరం హింసపై వివరణ ఇవ్వనున్నారు.