Sunday, June 2, 2024

అవినీతి నిర్మూలనలో యువతదే కీలక పాత్ర

కర్నూలులోని డిగ్రీ కళాశాలలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యాక్ రాయలసీమ అడ్వైజర్ కె.వేణుగోపాల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అవినీతి నిర్మూలనకై  యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. యువతపైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. అవినీతి పెరిగిపోవడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుందన్నారు. దేశంలో ఉన్న అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన విషయమై సమాజంలో మార్పు రావాలన్న ఆయన.. అప్పుడే అవినీతిని అంతం చేయగలమని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement