Sunday, May 5, 2024

ATP: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో.. గడ్డివాములు దగ్ధం

బుక్కరాయసముద్రం, మార్చి 1 (ప్రభ న్యూస్) : బుక్కరాయసముద్రం మండలం నీలా రెడ్డిపల్లి గ్రామంలో ఓబిరెడ్డి రమేష్ రెడ్డి గడ్డివాములు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. గడ్డివాములపైన విద్యుత్ తీగలు ఉండడంతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగులుకొని నిప్పులు గడ్డి వాముపైన పడ్డాయి.

దీంతో గడ్డివాములో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. పశువుల కోసం దానాలు పగడ్బందీగా నిర్మించుకున్నప్పటికీ విద్యుత్ తీగల రవ్వలు పడి గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబిరెడ్డి, రమేష్ రెడ్డిలకు వెంటనే ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement