Saturday, May 18, 2024

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యుల అరెస్ట్

అనంతపురం: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుంచి 10.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, త్రీ టౌన్ సి.ఐ హరినాథ్ లు విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో పటాన్ జాఫర్, బి.మారుతి కుమార్, వడ్డే గంగాధర్, గొడ్డుమర్రి మహేశ్, ఖలీడ్ మహమ్మద్, షేక్ బాషా ఉన్నారు. ప్రస్తుతం అరెస్టయిన వారిలో జాఫర్ ఖాన్, బి.మారుతి కుమార్ లు తాగుడు, తదితర చెడు అలవాట్లకు బానిసయ్యారు. ఈ వ్యసనాలు తీర్చుకునేందుకు సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. గంజాయి అక్రమంగా విక్రయిస్తే సులువుగా డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు.

విశాఖ జిల్లా నర్సిపట్నం ప్రాంతంలో తక్కువ ధరకి కొనుగోలు చేసి అనంతపురంలో ఎక్కువ రేటుకు అమ్మాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే… నర్సీపట్నం వెళ్ళి అక్కడి నుండి చింతలపల్లికి బస్సులో వెళ్లేవారు. అక్కడి నుండి ప్రవేటు జీపులో మొండిగడ్డ గ్రామం చేరి ఆ గ్రామ సమీపంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక్క కేజీ గంజాయి రూ.1500 రూపాయల ప్రకారం కొనుగోలు చేసేవారు. అక్కడి నుండీ అనంతపురం తరలించి ప్రస్తుతం అరెస్టయిన మిగతా నిందితులకు ఒక కేజీ రూ.5 వేల నుండి రూ.6 వేల వరకు విక్రయించేవారు. ఇలా… కొనుగోలు చేసిన గంజాయిని చిన్న పొట్లాల్లో ప్యాక్ చేసి అధిక ధరకు అమ్మేవారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్ఛి డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో త్రీటౌన్ హరినాథ్, సబ్-ఇన్ స్పెక్ట‌ర్ సి.వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది స్థానిక నేషనల్ పార్కుకు వెళ్లే దారిలో నాగులకట్ట వద్ద ఈ ముఠాను అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement