Sunday, April 28, 2024

అమ‌రావ‌తి ఉద్య‌మం @ 1500….

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 1500 రోజుకి చేరింది. కాగా,రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద గత టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే 2019 డిసెంబరు 17న సీఎం జగన్‌ శాసన సభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన వారిని కుదిపేసింది. మరుసటి రోజే రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది.

తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం. క్రమంగా అన్ని గ్రామాలకు వ్యాపించింది. ఇప్ప‌టికీ రైతుల ప‌ట్టువిడువ‌ల కుండా వివిధ రూపాల‌లో నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు.. ఈ ఉద్యమానికి వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్ని సంఘీభావం ప్రకటించాయి.

భూమి త్యాగం చేసిన రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంది… నారా లోకేష్
రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్నారు. రైతుల ఆందోళ‌న 15వందల రోజుకి చేరిన సంద‌ర్భంగా ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్న‌ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు.
‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుంది. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది’ అని నారా లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement