Sunday, April 28, 2024

AP | ఉత్తరాంధ్రాలో అన్ని సీట్లలో కూటమి అభ్యర్థుల ను గెలిపించాలి : చంద్రబాబు

రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తారకరామతీర్థ సాగర్ కు రూ. 284 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. వైసీపీ రూ. 76 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ. 237 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత అధికార పార్టీ రూ. 64 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే సాగునీరు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు.

వేలాది మంది పెట్టుబడులు రాకతో హైదరాబాద్ ఆర్థికంగా ఎదిగిందన్నారు. భోగాపురం శంకుస్థాపన చేసి భూమి ఇచ్చానని.. ప్రారంభించి ఉంటే అభినందించేవాడినన్నారు. గిరిజన యూనివర్సిసీటీకి 550 ఎకరాలు వెచ్చించి ప్రారంభిస్తే దాని జాడే లేదన్నారు. తాను వేసిన పాన్ల ప్రకారం జరిగుంటే ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా ఎదిగేదన్నారు. విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిందన్నారు.

కార్పోరేట్ కంపెనీలన్నింటినీ తరిమేశారని ఆరోపించారు. బీసీలకు తాను ఇచ్చిన పథకాలు రద్దు చేశారన్నారు. ఉత్తరాంధ్ర మీద సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పెత్తనం ఏమిటన్నారు. అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్తను ఎంపీగా ఇస్తున్నానన్నారు. సజ్జల మాటలు ఎలా ఉన్నాయంటే జగన్ మీద గులకరాయి పడితే తెలుగోడి మీద రాయిపడినట్లట.. అసెంబ్లీలో నా భార్యను ఇష్టారాజ్యంగా తిట్టాలేదా అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement