Friday, May 3, 2024

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారిన టీటీడీ వెబ్ సైట్

తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్‌సైట్‌ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించేది.

కానీ, దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వన్‌ ఆర్గనైజేషన్‌, వన్‌ వెబ్‌సైట్‌, వన్‌ మొబైల్‌ యాప్‌లో భాగంగా బుకింగ్‌ వెబ్‌సైట్‌నూ మార్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్‌సైట్‌ను మార్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని టీటీడీ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement