Friday, December 6, 2024

సంగం డెయిరీలో నాల్గవ రోజు ఏసీబీ సోదాలు

గుంటూరు లోని సంగం డెయిరీలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు రోజుల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఆడిషినల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఉదయం 11గంలకు సంఘం డైరీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభిచారు. సంగం డెయిరీలోని పరిపాలన విభాగంలో పలు బ్లాకుల్లో సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది…ఉద్యోగుల వివరాలు, వేతనాలు, నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీయనున్నట్లు సమాచారం….పలు ఫైళ్లను పరిశీలించి కీలక ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ ఆధికారులు ఉన్నారు. కాగా.. ఛాంబర్‌ల సీజ్, వరుస సోదాలపై యాజమాన్యం, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు వారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నిరసనకు దిగారు. విచారణ పేరుతో సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తున్నారని డైరీ వర్గాలు వాపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement