Sunday, February 5, 2023

AP | ఒక్కో ఫ్యామిలీకి 9 లక్షల బెనిఫిట్స్​.. వ్యక్తిగతంగా లేఖలు పంపుతున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం లబ్ధిదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాస్తోంది. ఈ మూడేళ్ల పాలనలో సీఎం జగన్​ నేతృత్వంలో ఒక్కో కుటుంబానికి ఎంత మేర లబ్ధిజరిగిందనే వివరాలతో ఈ లేఖలను పంపిస్తోంది. ఇట్లాంటి లేఖను ఓ నెటిజన్​ ట్విట్టర్​లో షేర్​ చేశారు.

- Advertisement -
   

ఈ మూడేళ్ల పాలనలో మీ కుటుంబానికి దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలను అందించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అని సీఎం జగన్​ పేరిట లేఖ.. అందులో ఏ పథకానికి ఎంత మేర అందించారనే వివరాలు పొందుపరిచారు. అయితే.. ఏపీ ప్రభుత్వం తీరును కొంతమంది మెచ్చుకుంటుంటే.. ఇంకొంతమంది తప్పుపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement