Friday, May 17, 2024

గంధం చెక్కలు కేసును చేధించిన పోలీసులు

అనంత‌పురం జిల్లా పెనుకొండ ఫారెస్ట్ ఆఫీసులో ఇటీవల చోరికి గురైన శ్రీగంధం చెక్కలు కేసును పెనుకొండ సబ్ డివిజన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన‌ ఏడుగురి నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన సరుకులో సుమారు రూ. 44 ల‌క్ష‌లు విలువ గల 68 శ్రీ గంధం చెక్కలు కల్గిన సంచులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు చోరికి వినియోగించిన రెండు ఈచర్ గూడ్స్ లారీలు, కారు, 3 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర రాష్ట్రాలలో నిఘాపెట్టి కేసును ఛేదించడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి వెల్లడించారు.

పెనుకొండ ఫారెస్టు ఆఫీసు చోరీ ఘటనకు ఈనెల రెండవ వారంలో పాల్పడ్డారు. ఇందులో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారు. వీరు కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్రాలకు చెందిన వారు. ప్రస్తుతం ఏడుగురు అరెస్టయ్యారు. మిగితా వారు పరారీలో ఉన్నారు. ఈ ముఠాలో దాదాపు అందరూ స్నేహితులే పైగా పాత నేరస్తులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement