Friday, May 17, 2024

AP: అన్న‌కు ష‌ర్మిల లేఖ‌.. న‌వ సందేహాలు ఉన్నాయంటూ ప్ర‌స్తావ‌న‌

తొమ్మిది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలంటూ డిమాండ్
28ప‌థ‌కాలు ఎందుకు ఆపారు..
చంపి శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన‌
ఎమ్మెల్సీపై ఎందుకు మీకు అనురాగం
లేఖ‌లో జ‌గ‌న్ ను నిల‌దీసిన ష‌ర్మిల

అమరావతి: తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు ? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా ? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు ? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు ? ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు ? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ తన లేఖలో షర్మిల తొమ్మిది ప్రశ్నలను సంధించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నవరత్నాల గురించి గర్వంగా చెప్పుకుంటున్న ఈ నేపథ్యంలో జగన్ కు షర్మిల నవ సందేహాలను సంధించారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు స‌మాధానాలు చెప్పాలంటూ ష‌ర్మిల డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement