Monday, April 15, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మన సంకల్పాలు ధృఢంగా కావాలంటే వాటిని సంరక్షణ చేయడం కూడా అవసరం. సంరక్షణ చేయకపోతే అత్యంత శ్రేష్ఠమైన ఆలోచనలు కూడా కాల క్రమేణా నశించి పోతాయి. మెరుపు లాగా సంకల్పంలో ధృఢత్వం తీసుకురావాలి. సంకల్పం పతాకంలాగా రెప రెప లాడుతుంటే దానిని ధృఢంగా చేయటానికి మనము దేనిని సమీక్షించాలి. ఏది మీకు మీ ఉన్నతమైన లక్ష్యం గుర్తుచేస్తుంది? ఏది మీ సంకల్పాల పునరుద్ధరణ చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రతివారు తమ స్వయం గురించిన జ్ఞానంతో కలిగి ఉంటారు. అయితే దానిని అవగాహన చేసుకొని, తరచుగా పున:స్మరణ చేసుకోవడం మనకు అవసరం. ఈరోజు నా సంకల్పాన్ని ధృఢంగా చేసుకొంటాను.

–బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement