Tuesday, May 28, 2024

Speaker – పోచారం స్వగ్రామంలో విజయదశమి వేడుకలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వగ్రామం పోచారంలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు.స్వగ్రామం పోచారంలోని నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజ నిర్వహించరు. గ్రామ ప్రజలకు, తనను కలవడానికి విచ్చేసిన వారందరికి దసరా శుభాకాంక్షలు తెలియ చేశారు.


తాను ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నేడు రాష్ట్రస్థాయిలో ఎన్నో ప్రభుత్వాలు కీలక పదవులు అనుభవించినప్పటికీ సొంత గ్రామాన్ని చిన్ననాటి స్నేహితులను పండుగలు సందర్భంగా కలుస్తూ ఉంటారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ,పోచారం సురేందర్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం దసరా రోజున పోచారం కుటుంబ సభ్యులు ఆనవాయితిగా జరుపుకునే ఆంజనేయ స్వామి గుడి నుండి జెండా తీసుకువెళ్ళి సభాపతి ఇంటి వద్ద ఉన్న మహబూబ్ సుభాని దర్గా వద్ద జెండా ఎగురవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో శ్రీ నవ దుర్గ దేవి సేవ సమితి ఏర్పాటు చేసినటువంటి దుర్గ భవాని అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో బాన్సువాడ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement