Sunday, June 16, 2024

Breaking – నేడు కరీంనగర్ కు, రేపుఆసిఫాబాద్ కు సీఎం కేసీఆర్..

కరీంనగర్ – తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు కరీంనగర్ కు రానున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాదులోని ప్రగతిభవన్ నుండి బయలుదేరి కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. రేపు ఆసిఫాబాద్ కు వెళ్లి పోడు భూముల పట్టాలు సీఎం పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement