Monday, October 28, 2024

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి : కలెక్టర్ సంగీత

ప్ర‌భన్యూస్ : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.సిరి ఫంక్షన్ హల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించుటకు ముందుకు సాగాలని అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని దివ్యాంగులలో ఎంతో నైపుణ్యంగల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించుటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకాదని పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ప్రభుత్వపరంగా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

అర్హులైన దివ్యాంగులకు ఆసరా పించన్లు మంజూరు చేసి ప్రతి నెలా అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామి పథకంలో దివ్యాంగులకు జాబ్ కార్డులు జారీ చేసి పనులు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలో మండలాల వారిగా అవసరమైన వారికి నూతన జాబ్ కార్డులు అందిస్తామని అన్నారు. వికలాంగులకు అవసరమైన పరికరాలను త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాస్థాయిలో పరిష్కారమయ్యే దివ్యాంగులు సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చిన దివ్యాంగులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement