అగ్గువ‌కే ఆపిల్ ఐఫోన్‌11.. కొన‌కుండా ఉండలేరంటే న‌మ్మండి..

ఆపిల్ ఐఫోన్ అంటే చాలామంది లైక్ చేస్తారు. దాని లుక్‌, ప‌ర్ఫామెన్స్ వంటివి అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. ఇక స్మార్ట్ ఫోన్ లలో ఆపిల్ ఒక బెస్ట్‌ బ్రాండ్ అయితే.. ఐఫోన్ ఒక అద్బుతమనే చెప్పాలి. అటువంటి ఐ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు తహతహలాడుతుంటారు. అయితే ఫోన్ ధరను చూసి చాలామంది కొన‌డానికి జంకుతుంటారు. ఇప్పుడు ఈ వార్త చ‌దివాక ఐ ఫోన్ కొనకుండా ఉండలేరంటే న‌మ్మండి. ఎందుకంటే.. ఐఫోన్ ఇపుడు రూ.17,800కే సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటే.. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్..”బిగ్ బచత్ ధమాల్” పేరుతో మార్చి 4 నుంచి 6 వ తేదీ దాకా భారీ డిస్కౌంట్ సేల్ ప్రారంభించింది. ఇందులో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలను డిస్కౌంట్ లో అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా ఐఫోన్ 11, ఐఫోన్‌ ఎస్‌ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 11 ధర రూ.32,000 ఉండగా.. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.17,800కే లభించ‌నుంది. ఐఫోన్‌ ఎస్‌ఈ ధర రూ.39,900 ఉండగా.. డిస్కౌంట్ లో రూ.30,299కే వ‌స్తుంది. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ లో గరిష్టంగా రూ.14,800 తగ్గించి..రూ.15,499కే ఐఫోన్‌ ఎస్‌ఈ లభిస్తుంది. ఈ మెగా ఆఫర్ తో పాటుగా వివిధ రకాల బ్యాంకుల డెబిట్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మరో ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ లోనూ ఐఫోన్ పై గరిష్టంగా రూ.14,900 వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ నడుస్తోంది. యాపిల్ సంస్థ మార్చి 8న కొన్ని కొత్త మోడల్స్ ను తీసుకురానున్న నేపథ్యంలో.. ప్రస్తుతం స్టాక్ ఉన్న మోడల్స్ పై ఈమేరకు డిస్కౌంట్లు ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది.

Exit mobile version