Monday, May 20, 2024

ఏపీలో బారులు తీరిన ఓటర్లు.. 12 శాతం పోలింగ్

అమరావతి: ఏపీలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. 9 గంటలు దాటే సమయానికి సుమారు 12 శాతంగా నమోదైంది. ఏపీ వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్​ శాతం ఇలా ఉంది.

శ్రీకాకుళం-10%
విజయనగరం-14%
విశాఖ-14%
తూర్పుగోదావరి-16%
పశ్చిమగోదావరి-16%
కృష్ణా-13%
గుంటూరు-16%
ప్రకాశం-14%
నెల్లూరు-12%
చిత్తూరు-9%
అనంతపురం-12%
కడప-8%
కర్నూలు-11%

అటు ఉ. 10 గంటల వరకు విజయనగరం 18.02, పార్వతీపురం 23.99, బొబ్బిలి 24.83, సాలూరు 25.09, నెల్లిమర్ల 24.46 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉ.11 గంటల వరకు 28.6 శాతం పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో ఉ.11 గంటల వరకు 26.11 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement