కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం..

క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతుంటే స‌ల‌స‌ల మండుతున్న ధ‌ర‌లతో స‌గ‌టు జీవి కుదేల‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది. మేలో టోకు ధ‌ర‌ల సూచీ ఆధారిత ద్ర‌వ్యోల్బ‌ణం 12.49 శాతం పెరిగి ఆల్ టైం హైకి చేరింది. ఏప్రిల్ లో ఈ సూచీ 10.49 శాతం పెర‌గింది. టోకు ధ‌ర‌ల సూచీ ఆధారిత ద్ర‌వ్యోల్బ‌ణం మేలో వ‌ర‌సగా ఐదో నెల కూడా ఎగ‌బాక‌డంతో ధ‌ర‌లు సామాన్యుల‌కు దూర‌మ‌య్యాయి. ఇక గ‌త ఏడాది మేలో డ‌బ్ల్యూపీఐ మైన‌స్ 3.37 శాతంగా న‌మోదైంది. ముడిచ‌మురు ధ‌ర‌లు, పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఫ‌ర్నేస్ వంటి మిన‌ర‌ల్ ఆయిల్స్ తో పాటు త‌యారీ వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో మే నెల‌లో డబ్ల్యూపీఐ రికార్డుస్థాయిలో ఎగ‌బాకింద‌ని వాణిజ్య ప‌రిశ్ర‌మల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక త‌యారీ వస్తువుల ద్రవ్యోల్బ‌ణం ఏప్రిల్ లో 9.6 శాతం పెరగ్గా, మేలో 10.8 శాతం పెరిగింది.