Sunday, June 16, 2024

Uttarakhand: కిక్కిరిసిన వార‌ణాసి, ప్ర‌యాగ్‌రాజ్‌… గంగాన‌దిలో పుణ్య‌స్నానాలు

నేడు బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా భ‌క్తులు గంగాన‌దిలో పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తారు. అందులో భాగంగా వార‌ణాసి, ప్ర‌యాగ్‌రాజ్‌, హ‌రిద్వార్‌ల‌లోపుణ్య‌స్నానాలు చేసేందుకు భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఆ ప్రాంతాల‌న్ని కిక్కిరిపోయాయి. భక్తులకు భద్రత కల్పించేందుకు వివిధ గంగా ఘాట్‌ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు.

- Advertisement -

బుద్ధ పూర్ణిమ నాడుగంగా స్నానం చేస్తే మనిషికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇంతేకాకుండా ఈ రోజున స్నానం చేయడం వల్ల మనిషి మనసు, శరీరం రెండూ పవిత్రంగా మారుతాయని నమ్ముతారు. ఈ రోజున గంగాస్నానం చేసి, పూర్వీకులకు తర్పణం పెడితే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అంటారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. గౌతమ బుద్ధుడిని విష్ణువుకు తొమ్మదవ అవతారంగా భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement