Sunday, June 16, 2024

అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు తిరిగొచ్చిన ప్రధాని మోదీ

భారత ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగొచ్చారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన 65 గంటల్లో 20 సమావేశాలకు హాజరవడం గమనార్హం. విమానంలో కూడా నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పలువురు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ బిజీ షెడ్యూల్ ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది పార్టీ నేతలు మోదీకి స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్ ను లోకల్, నాన్-లోకల్ అంటూ విమర్శలు చేయటం తప్పు: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement