హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దొడ్ల డెయిరీ సోమవారం భారీ లాభాలను అందించింది. కర్నాటకలోని శ్రీ కృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దొడ్ల డెయిరీ షేరు వేగంగా ఎగబాకింది. ఇంట్రాడేలో 20 శాతం మేర లాభపడింది. గత సెషన్లో రూ.457 వద్ద క్లోజ్ అయ్యింది. సోమవారం ఉదయం రూ.500 వద్ద ప్రారంభమైన షేరు.. అత్యధికంగా రూ.548ను తాకింది. కనిష్టంగా రూ.482ను తాకింది.
చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 15.59 శాతం లాభపడి.. రూ.528 వద్ద ముగిసింది. రూ.50కోట్లకు శ్రీ కృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను సొంతం చేసుకోవడమే ర్యాలీకి కారణం. వచ్చే రెండు నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. 1989లో ఏర్పాటైంది. కర్నాటకలో ఇదే తొలి ప్రైవేటు డెయిరీ సంస్థ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.67 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.76 కోట్ల టర్నోవర్ ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..