Thursday, September 12, 2024

Editorial : అగ్రరాజ్యం…అభిజాత్యం..!

ఇరాన్‌లోని చాబహార్‌ రేవుకు సంబంధించి భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పి కొట్టి భారత సార్వభౌమాధికారాన్ని మరోసారి గుర్తు చేశారు. అమెరికాతో మన దేశానికి వ్యూహాత్మక భాగ స్వామ్యం ఉన్నందున ఇంకే దేశంతోనూ ఎలాంటి ఒప్పందాలు చేసుకోరాదని ఆంక్షలను విధించడం అగ్ర రాజ్యం ఆభిజాత్యానికి నిదర్శనం. అలాగే,ఇరాన్‌తో తమ కు ద్వైపాక్షికంగా సమస్యలుంటే ఉండవచ్చు, కానీ, ఏ ఇతర దేశమూ ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు పెట్టు కోరాదని ఆదేశించడం అగ్రరాజ్యం దురహంకార ధోర ణికి నిదర్శనం.

- Advertisement -

స్వేచ్ఛా వాణిజ్యం అమలులోకి వచ్చిన తర్వాత వివిధ దేశాలు తమ ప్రయోజనాలకు అనుగు ణంగా ఒప్పందాలు చేసుకోవడం ఆనవాయితీ అ యింది.చాబహార్‌ ప్రాజెక్టు విషయంలో అమెరికా సంకుచితంగా ప్రవర్తించడం మానుకోవాలంటూ మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చేసిన ప్రకటన హెచ్చరిక వం టిదే.ఇదే చాబహార్‌ ప్రాజెక్టు గురించి అమెరికా గతంలో ప్రశంసలు కురిపించింది. అయితే, ఇరాన్‌పై ఆంక్షలు ఉన్నందున ఆ దేశంతో చేసుకునే ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఏ దేశమైనా చేసుకుంటే ఆంక్షల చట్రంలో ఇరుక్కు పోతుందని అమెరికా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నప్పుడు కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు.ఇరాన్‌ నుంచి చమురు కొనవద్దని హూంకరించారు.

ఇంధనం కొనుగోలుకు సంబంధించి ఏ దేశమూ మనలను ఇంత తీవ్రంగా హెచ్చరిం చలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగించడాన్ని మన దేశం వ్యతిరేకిస్తోంది.అయినప్పటికీ రష్యా నుంచి మన దేశం చమురును దిగుమతి చేసుకుంటోంది.పైగా ధర విష యంలో రష్యాకల్పించిన వెసులుబాటును ఉపయో గించుకుని మరీ చమురును దిగుమతి చేసుకుం టోంది. దీనిపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ చేసిన హెచ్చరి కను మన దేశం లెక్క చేయలేదు.ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న దేశాలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది.చాబహార్‌ రేవు నిర్మాణం విషయంలో మన దేశం ఆసక్తి చూపడానికి కారణం ఉంది.రష్యా నుంచి గ్యాస్‌ దిగుమతికి ఇది ఎం తో దోహదం చేస్తుంది. అఫ్గనిస్తాన్‌తో వాణిజ్య సంబం ధాలు మరింత సులభతరం అవుతాయి.

సులభతర వాణి జ్యానికి ఇప్పుడు అన్ని దేశాలూ నౌకా రవాణాకి మార్గా లను అన్వేషిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల నౌకా వాణిజ్యానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.వాటిని పరిష్కరించుకునేందుకు కూడా మన దేశం కృషి చేస్తోంది. ఇరాన్‌తో వాణిజ్యం విషయంలో అమెరికా విధించే ఆంక్షలు మనకు చాలా విధాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. ఇరాన్‌తో దశాబ్దాలుగా వాణిజ్య సంబం ధాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆధిపత్య ధోరణిని ఇప్పుడు చైనా అనుకరిస్తోంది.అమెరికా తర్వాతి స్థా నాన్ని ఆక్రమించడం కోసం ప్రయత్నిస్తోంది.చైనా కూ డాఈ మాదిరి ఆంక్షలు విధిస్తోంది.అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులలో ఇలాంటి ఆంక్షలు, ఆదేశాలు చెల్లుబాటు కావు. అమెరికా ,చైనాల ఏక పక్ష ధోరణులను ప్రపంచ దేశాలు క్రమంగా గ్రహిస్తున్నాయి. చాబహార్‌ రేవు ఒప్పందం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నార్త్‌సౌత్‌ కారిడార్‌ని ఉపయోగించి పాక్‌తో సంబంధం లేకుండా అఫ్గనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాల తో వాణిజ్యం చేయవచ్చు.చాబహార్‌ రేవు ఒప్పందం 2003లోనే కుదిరింది.అయితే, అమెరికా మోకాలడ్డడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని బూచిగా చూపించి ఈ ఒప్పందం అమలులోకి రాకుండా అమెరికా అడ్డుకుంది.పోర్టు అండ్‌ మారిటైమ్‌ ఆర్గనైజేన్‌ ఆఫ్‌ ఇరాన్‌తో మన దేశం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 120 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతోపాటు అదనంగా 250 మిలియన్‌ డాలర్ల రుణాన్ని సమకూర్చనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement