TS DSC | డీఎస్సీకు మొత్తం 1,77,502 దరఖాస్తులు.. హైదరాబాద్‌ నుంచే అత్యధిక దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ గడువు ముగియడంతో పాఠశాల విద్యాశాఖ సోమవారం జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. డీఎస్సీకు మొత్తం 1,77,502 దరఖాస్తులు అందాయి. హైదరాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులు వచ్చాయి. ఆతర్వాత వికారాబాద్‌ జిల్లా నుంచి 9772 దరఖాస్తులు, నల్గొండ నుంచి 9041 దరఖాస్తులు అందాయి.

తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో జయశంకర్‌ జిల్లా-1338, మేడ్చల్‌-1483, ములుగు-1526, జనగాం-1616 ఉన్నాయి. ఎస్జీటీ తెలుగు మీడియం విభాగానికి అత్యధికంగా మొత్తం 60,460 దరఖాస్తులు అందాయి. ఆదిలాబాద్‌-3881, వికారాబాద్‌-3772 రాగా, పెద్దపల్లి జిల్లా నుంచి 390 దరఖాస్తులు వచ్చాయి.

Exit mobile version