Election Meetings – రేపే ప్రజా ఆశీర్వాద సభ… ఏర్పాట్లను పరిశీలించిన విప్ రేగా కాంతారావు

.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రేపు జరిగే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు వేగంగా నడుస్తున్నాయి. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ హాజరుకానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దగ్గరుండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు

, సోమవారం జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు అభిమానులు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు, శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, వచ్చే ప్రజలకు అతిథులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు…

Exit mobile version