జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించండి: కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి గురించి మంగళవారం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసి పలు రహదారుల మార్గాల్లో నిర్మించవలసిన వెహికల్ అండర్ పాస్‌ల గురించి ప్రత్యేకంగా చర్చించారు.

చౌటుప్పల్, టేకుమట్ల, కోదాడ వద్ద నిర్మించదలచిన అండర్ పాస్‌ల ప్రతిపాదనలు ప్రాంతీయ కార్యాలయం నుంచి జాతీయ రహదారుల సంస్ధ హెడ్ ఆఫీసుకు చేరాయని, వాటిని త్వరగా అనుమతించవలసినదిగా కోరారు. వంగపల్లి జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించవలసిన అండర్ పాస్ గురించి సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లారు. కోమటిరెడ్డి విజ్ఞప్తిపై ఆాయన సానుకూలంగా స్పందించారు.

Exit mobile version