గర్భిణీని సురక్షితంగా హాస్పిటల్ కి తరలించిన.. ఎన్డీఆర్ ఎఫ్ బృందం

భూపాలపల్లి : భారీ వర్షాల వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట బ్రిడ్జ్ తెగిపోయింది. దీంతో పలిమేల మండలానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి అవతల పలిమెల మండలం లెంకల గడ్డ గ్రామానికి చెన్నూరు రజితకు ఈరోజు పురిటి నొప్పులు రావడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఎన్డీఆర్ ఎఫ్ బృందం, అంబాట్ పల్లి సర్పంచ్ ఎరవేల్లి విలాస్ రావు గర్భిణీ మహిళలను వంతెన దాటించారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ప్రైవేటు వాహనంలో బాలింతను ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ సూరారం గ్రామానికి రావడంతో అందులోకి ఎక్కించి మహాదేవపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

Exit mobile version