RCB vs SRH | చిత‌క‌బాదిన ఎస్‌ఆర్‌‌హెచ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జ‌రుగుతున్న మ్యాచ్ లో.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేశారు. ఎస్‌ఆర్‌‌హెచ్‌ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ (102), అభిషేక్ శ‌ర్మ(34)లు జ‌ట్టుకు శుభారంభం అధించారు.

ఇక‌ బౌండ‌రీల‌తో ఆర్సీబీ బౌల‌ర్ల‌పై విర‌చుకుప‌డ్డ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే (102) సెంచ‌రీ బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67)తో హాప్ సెంచ‌రీ సాధించాడు. ఇక ఆఖ‌ర్లో ఐడెన్ మార్క్రామ్ (17 బంతుల్లో 32 నాటౌట్), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్) కూడా బౌండ‌రీల మొత మోగించారు. దాంతో, హైద‌రాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

కాగా, 8.1 ఓవ‌ర్ల‌లో 108 ప‌రుగుల‌కు ఎస్‌ఆర్‌‌హెచ్ తొలి వికెట్ ప‌డింది. టోప్లీ వేసిన మొద‌టి బంతికి అభిషేక్ శ‌ర్మ (34) ఔట్ అయ్యాడు. 12.3 ఓవ‌ర్లో 165 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ ట్రావిస్ హెడ్ (102) క్యాచ్ ఔట‌య్యాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాన హెన్రిచ్ క్లాసెన్.. 16.6 ఓవ‌ర్లో లాకీ ఫెర్గూసన్ లో పెవిలియ‌ర్ చేరాడు.

Exit mobile version