Postal ballot | హోమ్ ఓటింగ్‌కు నోటిఫికేషన్ జారీ..

త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కోసం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, శారీరక వైకల్యం ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అనుమతినిస్తారు. పోలింగ్ తేదీ 13వ తేదీకి పది రోజుల ముందు నుంచి ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచారు.

Exit mobile version