ఓయూలో హై టెన్షన్ .. విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం


ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ జేఏసీ నేత పెట్రోలు పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌యత్నించ‌డంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే టీఆర్ఎస్ నేతలు ఓయూ కు రావాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ వద్ద ఒక విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా యువత భవిష్యత్ ను నాశనం చేస్తుందని ఆందోళనకు దిగారు. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ పెట్రోలు పోసుకుని హడావిడి చేయడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే యువకుడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Exit mobile version