పవన్ పై ప్రభుత్వ తీరు బాధ కలిగించాయి.. చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ, ఆవేదన కలిగించాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాట్లాడుతూ… వాళ్లపైన వాళ్లే దాడులు చేసుకొని జనసేన పార్టీ, టీడీపీ లపై కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వాళ్లే దాడులు చేసుకొని మాపై కేసులు పెడుతున్నారన్నారు. ఇదేం ప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు వచ్చానన్నారు.

Exit mobile version