మోదీకి గొయ్యి తవ్వుతాం.. జేఎన్‌యూ గోడలపై వివాదాస్పద రాతలు

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో అనేక గోడలపై మరొకసారి అభ్యంతరకరమైన నినాదాలు కనిపించాయి. ఆదివారం ఉదయం జేఎన్‌యూకు వచ్చిన విద్యార్థులకు స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ గోడలపై ‘కాషాయం తగలబడిపోతుంది’, ‘మోడీకి గొయ్యి తవ్వుతాం’ లాంటి వివాదాస్పద నినాదాలు కనిపించడంతో వ్యవహారం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. నినాదాల వెనుక ఎవరూ ఉన్నదీ తేల్చేందుకు దర్యాప్తు చేపట్టినట్టు జేఎన్‌యూ అధికారులు తెలిపారు.

Exit mobile version