Supreme Court | అభ్యర్థులకు ఆ విశ‌యంలో గోప్య‌త పాటించే హ‌క్కు ఉంది..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థికి తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు ఉందని పేర్కొంది. అభ్యర్థులు తమ ప్రతి ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ సమాచారాన్ని తెలుసుకోవడం ఓటర్లకు క‌చ్చిత‌మైన‌ హక్కు కాదని పేర్కొంది. అభ్యర్థికి చాలా విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే తప్ప, అతని కుటుంబ సభ్యుల వారసత్వ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Exit mobile version