టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం

తిరుమల, ప్రభన్యూస్‌ : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్‌ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కృష్ణమూర్తి వైద్యనాథన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version