ఆలత్తూరు శ్రీ వ‌ర‌ద‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో బాలాలయం

తిరుప‌తి : కార్వేటి నగరం మండలం ఆలత్తూరు శ్రీ వ‌ర‌ద‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయం ప్రాంగ‌ణంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేస్తారు. మహా సంప్రోక్షణ జరిగేవరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

Exit mobile version