TS | కోడ్ ఎఫెక్ట్.. అల్లు అర్జున్ పై కేసు న‌మోదు…

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని పలువురు ఫిర్యాదు చేశారు. నంద్యాల టూటౌన్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బన్నీని చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ 31 ఏపీ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా కలవడం నేరమని ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పిఎస్ లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్ల‌ పై కేసు నమోదు చేశారు.

Exit mobile version