టీడీపీ నాయకురాలు అనితకు బెదిరింపు కాల్

టీడీపీ ఫైర్ బ్రాండ్, మహిళా నేత వంగలపూడి అనితకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఏపీలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై ఈరోజు విజయవాడలో మహిళా మండలి సంఘాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో ఉన్నప్పుడే వంగలపూడి అనితకు బెదిరింపు కాల్ రావడంతో ఆమె ఫోన్‌ స్పీకర్ ఆన్‌ చేసి అక్కడే ఉన్న మీడియా ముందే అతనితో మాట్లాడారు. ఇంతకీ అవతలి వ్యక్తి ఏమన్నాడంటే, మీరు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాస్త తగ్గించుకొంటే మంచిదని వార్నింగ్ ఇచ్చాడు.

Exit mobile version