AP | 16 నుంచి జనసేన నెల్లూరు జిల్లా సమావేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఇకపై పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనున్నారు. నేటి నుంచి 15 తేదీ వరకు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

అందులో భాగంగా తొలుత ఈ నెల 16వ తేదీ నుండి ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ నెల16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలు, జనసైనికులు, వీరమహిళలతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, సూళ్ళూరుపేట నియోజకవర్గ నాయకులు, జనసేన శ్రేణులతో సమావేశాలు ఉంటాయి.

17వ తేదీన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు నియోజక వర్గాల జనసేన నాయకులు, జనసేన శ్రేణులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తులో ప్రజా సమస్యలపై చేయబోయే పోరాటం, తెలుగుదేశం పార్టీతో పొత్తు, సమన్వయం వంటి అంశాలపై జనసేన పార్టీ శ్రేణులతో చర్చించి దిశానిర్దేశం చేస్తారు. పార్టీకి సంబంధించి పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు.

Exit mobile version