ఐపీఎల్ ట్రేడ్ అంటే ఏమిటీ..? ట్రేడ్ ద్వారా వ‌చ్చే లాభాలు..!

ఐపీఎల్లో ప్రతి ఏడాది సీజన్ కు ముందు మినీ వేలం జరుగుతుంది. నాలుగేళ్లకోసారి మెగా వేలం జరుగుతుంది. ఫ్రాంచైజీలు తమకు అవసరం లేని ప్లేయర్లను వేలంలోకి రిలీజ్ చేస్తాయి. వేలంలోకి వచ్చిన ప్లేయర్లను ఫ్రాంచైజీలు తమ అవ సరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే, వేలం అవసరం లేకుండానే ఆటగాళ్లను పొందే ప్రక్రియనే ఐపీఎల్ Q. దీనినే ట్రేడింగ్ విండో అని కూడా అంటారు. ఈ విధానం ద్వారా ఆయా జట్లు ప్లేయర్లను మార్పిడి చేసుకు నేందుకు వీలు ఉంటుంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీల అనుమతితోనే ఇది జరుగుతుంది. దీనికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి.

ఐపీఎల్ ట్రేడింగ్ రెండు విధాలుగా జరుగుతుంది. ఒక్కటి క్యాష్ డీల్ (Cash deal). ఇందులో ఇతర ఫ్రాంచైజీ ప్లేయర్ (Franchise player) కోసం నగదు చెల్లించడం. ఉదాహరణకు గత సీజన్లో హార్లిక్ పాండ్యా కోసం గుజరాత్ టైటాన్స్ ను ముంబై ఇండియన్స్ రూ. 15 కోట్లు చెల్లించింది. మరోటి ఆటగాళ్ల మార్పిడి. ఇందులో ఇరు ఫ్రాంచైజీలు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను మార్చుకుంటాయి. ఇక్కడ డబ్బు చెల్లించడం ఉండదు. 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తమ బౌలర్ అవేష్ ఖాన్ ను రాజస్థాన్ రాయల్స్ ను ఇవ్వగా.. రాజస్థాన్ తమ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ను లక్నోకు ఇచ్చింది. ఇక, ట్రేడింగ్ రెండు దశల్లో మొదటిది ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత ప్రారంభమై వేలానికి వారం ముందు ముగుస్తుంది. రెండోది వేలం ముగిసిన తర్వాత మొదలై సీజన్ ప్రారంభానికి నెల ముందు వరకు ట్రేడింగ్ జరుగుతుంది.

ఫ్రాంచైజీలు ట్రేడింగ్ ఆప్షన్ ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్ అడ్వాంటేజ్. ప్లేయర్ ను ట్రేడ్ చేయడం ద్వారా ఫ్రాంచైజీ అధిక మొత్తం పొందవచ్చు. ఉదాహరణకు గత సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.17.5 కోట్లకు ట్రేడ్ చేసింది. ఆ ఫండ్ ముంబై రూ.15 కోట్లకే పాండ్యాను సొంతం చేసుకుంది. అలాగే, వేలంలో కంటే ట్రేడ్ ద్వారా తక్కువ మొత్తంలో ప్లేయర్ను పొందడానికి కూడా ఇదే ఉదాహ‌ర‌ణ‌. ఒకవేళ పాండ్యా వేలంలోకి వెళ్తే రూ.15 కోట్లకు మించి ధర పలుకుతాడనడంలో ఎవరికీ అను మానాలు లేవు. మరో బెన్ఫిట్ జట్టును సమతుల్యం చేసుకోవడం. ప్లేయర్ల మార్పిడి ద్వారా జట్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ శిఖర్ ధావన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసింది. అప్పుడు ఎస్ఆర్ హెచ్ ముగ్గురు ప్లేయర్లను తీసుకోగా.. అందులో ఒక్కడే అభిషేక్ శర్మ. అలా వచ్చిన అభిషేక్ ఇప్పుడు ఎస్ఆర్చ్ జట్టులో కీలక ప్లేయర్ గా మారిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ చరిత్రలో ఇప్ప టివరకు ట్రేడ్ అయిన మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్(ఆస్ట్రేలియా). 2024 సీజన్ కు ముందు ముంబై అతన్ని రూ. 17.5 కోట్లకు బెంగళూరుకు ఇచ్చింది. అయితే, 2023లో మంచి ఫామ్ కనబర్చిన గ్రీన్ గతేడాది పెద్దగా ఆకట్టుకో లేదు. ఆర్సీబీ తరపున 13 మ్యాచ్లో 255 రన్సే చేశాడు. గ్రీన్ తర్వాత రెండో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ట్రేడ్ ప్లేయర్ పాండ్యా. పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ముంబై రూ.15 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ (2022)లోనే పాండ్యా గుజరాత్
జరుగుతుంది. టైటాన్ ను విజేతగా నిలిపాడు. 2023లోనూ ఫైనలు చేర్చాడు. దీంతో ముంబై.. గుజరాత్ కు భారీ మొత్తం చెల్లించి అతన్ని తీసుకుంది. ముంబై కెప్టెన్సీని కూడా కట్టబెట్టింది. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ శార్దూల్ ఠాకూర్ ను రూ.10.75 కోట్లకు కోల్కతా నైట్ రైడ్స్ ర్స్ ట్రేడ్ చేసింది. ఈ ఏడాది లక్నోకు ఆడాడు. 2023లో లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ను రాజస్థాన్ రాయల్స్ రూ.10 కోట్లకు తీసుకుంది. అలాగే, ప్లేయర్ కు బదులు దేవదత్ పడిక్కల్ ను లక్నోకు ఇచ్చింది. 2022లో గుజరాత్ టైటాన్స్ న్యూజిలాండ్ బౌలర్ ను రూ.10 కోట్లు దక్కించుకోగా.. ఆ తర్వాతి సీజన్ కు అంతే మొత్తంతో కోల్ క‌త్తా నైట్ రైడర్ ను ట్రేడ్ చేసింది.

Leave a Reply